అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా కొనసాగుతోంది..రాష్ట్రంలోని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లో ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రెండు వేలకు పైగా బాల,బాలికలకు ఏపీ పోలీసులు విముక్తి కల్పించారు. డీజీపీ ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే…ఈ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ఫేజ్ 6వ విడత ముగింపు కార్యక్రమం మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ గత ఐదు విడతల్లో జరిగిన ముస్కాన్ ఒక ఎత్తు. ఈ సారి జరిగిన ముస్కాన్ ఇంకో ఎత్తు. వారం రోజులు నుండి జరిగిన ముస్కాన్ కోవిడ్-19 ఎంతో సక్సెస్ సాధించిందన్నారు.ఈ విషయంలో ఆపరేషన్ ముస్కాన్ బృందం పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారని పేర్కోన్నారు. వేలాదిమంది పిల్లలను రక్షించటం ఆనందాన్ని, తృప్తిని ఇస్తోందని, ఆపరేషన్ ముస్కాన్‌తో నాలుగేళ్ళ తర్వాత తల్లి దగ్గరకి కొడుకును చేర్చామని తెలిపారు. కరోనా టెస్టుల ద్వారా చాలా మందిని కోవిడ్ నుంచి కాపాడగలిగామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌ను చాలెంజ్‌గా తీసుకొని పనిచేసిన సీఐడీకి బృందాలకు అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాలో రెస్క్యూ చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు.అంతేగాక సమన్వయంతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించిన ముస్కాన్ బృందాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం 4,806 మందిని కాపాడామని తెలిపారు.బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలను రక్షించామన్నారు. పట్టుబడ్డవారిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు…
