నర్సీపట్నం : ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటికరణను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌భ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నర్సీపట్నం శ్రీకన్య కూడలి నుండి సి.బి.ఎమ్ కాంపౌండ్ వరకు 1500 బైకులతో ర్యాలీ నిర్వహించడంతో నర్సీపట్నం జనహోరులో సంద్రంగా మారింది. అనంతరం సి.బి.ఎమ్ కాంపౌండ్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటికరణ చేస్తే ఊరుకునేది లేదని దీనికోసం ఎంతవరకు అయినా పోరాడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.తక్షణమే కేంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంటు ప్రవేటికరణ పక్రియ ఆపివేయాలని డిమాండ్ చేసారు.ఈ విషయంలో ఎంతటి త్యాగాలకైన సిద్దంగా ఉన్నామన్నారు.
