IMG-20210616-WA0231.jpg

నూతన ఆస్తి పన్ను విధానం వెంటనే రద్దు చేయాలి.

నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ రాష్ట్రా పార్టీ పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలన్న పిలుపుమేరకు నియోజకవర్గ కన్వీనర్‌ కాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో పెంచినపన్నులు రద్దు చేయాలని నర్సీపట్నం మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం ఇచ్చారు. కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పన్నుల వడ్డన మొదలు పెట్టి సంక్షేమం పేరుతో తాయిలాలు పంపిణీ చేస్తురన్నారు.పన్నుల పేరుతో దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్తి పన్ను శాతము (సంవత్సరమునకు) అనగా, నివాస భవనములపై పన్ను శాతము 0.15%, నివాసేతర భవనములపై పన్నులపై 0.30% ఖాళీ స్థలముపై(సంవత్సరమునకు) పన్ను శాతము 0.50%ను మరియు రెట్టింపు చేయదలచుకున్న ఇతరత్రా పన్నులను తక్షణమే నిలుపుదల చేసి ప్రజలపై ఆర్ధిక భారము మోపకుండా మీరు ప్రతిపాదించిన తీర్మానమును తక్షణమే రద్దు చేయాలని,చెత్తపై, పట్టణ ప్రాంతాల వారికి రోజుకు రూ 4/- చొప్పున్న, గ్రామీణ ప్రాంతాల వారికి రోజుకి 3/- విధిస్తున్న రెట్టింపు వసూళ్ల యొక్క నిర్ణయమును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసమర్థత పాలనతో తిరోగమన నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ ను అప్పులుపాలు చేస్తూ ప్రభుత్వ ఆస్ధులను తనఖా పెడుతూ ప్రజల భవిష్యత్తు ఆశలను అంధకారంలోకి నెడుతూ,ఆల్ ఫ్రీ ఉచితఫధకాలు ఓటుబ్యాంకు రాజకీయాలతో రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాలుచేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలనడ్డి విరగొట్టేలా ప్రవేశపెట్టిన అసంబధ్దత అశాస్త్రీయ నూతన ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్షుడు తమరాన ఎర్రంనాయుడు మాట్లాడుతూ చెత్తపై కూడా ప్రభుత్వం యూజర్ వసూలు సరికాదు ప్రభుత్వానికి నవరత్నాలకు డబ్బులు కావాలని ఏవిధమైన పన్నులు వేసి వసూలు చేసుకోవాలన్న ఆలోచన వస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చెత్తపై పన్ను వెయ్యలేదని ప్రజలపై పన్నులు రుద్దకుండా నూతన ఆస్దిపన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోవిడ్ నిభందనలు పాటిస్తూ అసెంబ్లీ కన్వీనర్ కాళ్ల సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షుడు తమరాన ఎర్రంనాయుడు, ఒ.బి.సి మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్, సీనియర్ నాయకులు చిందాడ నూకేశ్వరరావు, నాతవరం మండల అధ్యక్షుడు లాలం వెంకటరమణ,రాష్ట్ర మహిళా మోర్చ కార్యవర్గ సభ్యులు సోము వెంకటలక్ష్మి , కురచా కామేశ్రరావు, ఎస్.సి మోర్చా నాయకులు రాజాన రమణ, నేతల బుచ్చిరాజు, యువమోర్చా నాయకులు మోహన్ , బోలెం శివ, జగన్నాధ్,  తదితరులు పాల్గొన్నారు…

Latest News