తెనాలి : పట్టణంలో జరుగుచున్న మెగా వేక్సినేషన్ ప్రక్రియను తెనాలి సబ్ కలెక్టరు డాక్టర్.నిథి మీనా ఐఏఎస్ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంలో సాయంకాలం పలు కేంద్రాలను ఆమె తనిఖీచేశారు. 18-44 సంవత్సరముల వారికి మొదటి డోసు నిర్దేశించిన లక్ష్యాలను సాథించాలని సిబ్బందిని ఆదేశించారు.అలాగే 45 సం॥పైబడిన వారిలో మొదటి డోసు వేయించుకొనని వారిని ,గర్భిణిలను గుర్తించి వేక్సినేషన్ విషయంలో వారిని చైతన్య పరచి సమాయత్తం చేయాలని ఆదేశించారు. పట్టణంలోని సాలిపేట, పినపాడు, పాండురంగపేట, చెంచు పేట సచివాలయల్లో జరుగుతున్న వేక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అమర్తలూరు పిహెచ్‌సి సందర్శించి వేక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.డి.హెచ్ఓ డాక్టర్. జములానాయక్ , సంబంథిత సచివాలయ సిబ్బంది, ఆషా, ఏఎన్ఎమ్‌లు వారిని అనుసరించారు…
