Arilova Road Meeting

ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం.

గొలుగొండ: ఆరిలోవ అటవీ ప్రాంతంలో 25 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు 15రోజుల్లో ప్రారంభం. ఇప్పటికే రోడ్డు నిర్మాణంకై నర్సీపట్నం డిఎఫ్ఓ, విశాఖపట్నం సిసిఎప్,సిఎఫ్ లు అనుమతులు.మంజూరు చేసారు. అరిలోవ అటవీ ప్రాంతంలో గల ఐదోమైలు రాయి నుంచి జిల్లేడుపూడి వరకు 90 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం. సాలికమల్లవారం నుండి వెంకటాపురం వరకు 90 లక్షలు రూపాయలతో రోడ్డు నిర్మాణానికి నిధులుమంజూరు.అలాగే కే డి పేట ప్రధాన రహదారి నుండి డొంకాడ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు.ఈ విష‌య‌మై స్ధానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ అట‌వీశాఖ కార్యాల‌యంలో స‌మీక్ష చేసారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుర్ల గిరిబాబు.చీడిగుమ్మల పిఎసిఎస్‌ అధ్యక్షులు రామకృష్ణ, జోగంపేట సెగ్మెంట్ ఇంచార్జ్‌ జక్కు అప్పల స్వామినాయుడు,సాలికమల్లవరం సర్పంచ్ పెదిరెడ్ల నూకరత్నం. కసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు…

Latest News